విజయవాడలో ఘోర ప్రమాదం, కారణం అదే: హోం మంత్రి

-

విజయవాడ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆ తర్వాత ఆస్పత్రికి తరలించే క్రమంలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు చెప్తున్నారు.

మొత్తం 50 మంది కరోన రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. భవనంపై నుంచి ప్రాణ భయంతో నలుగురు దూకేశారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. దీనిపై హోం మేకతోటి సుచరిత స్పందించారు. స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారు అద్దెకు తీసుకొని కరోనా కేర్ సెంటర్ గా వినియోగిస్తున్నారని… ఈ కరోనా కేర్ సెంటర్ లో 40 మంది కరోనా భాదితులు, 10 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు తెలిసిందని ఆమె అన్నారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా తెలుస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news