ఆత్మగౌరవ నినాదం పునాదిగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంత పెద్దవారైనా దమ్ముగా ముందుకువెళ్లారు.. సింహగర్జనే తనదైన శైలిగా సాగిపోయారు. తెలుగువాడి దమ్ము ఏమిటో హస్తినకు రుచిచూపించారు. దేశంలోనే పేరు ప్రతిష్టలు సంపాదించారు. సప్తసముద్రాలు ఈదినవాడు ఇంటివెనక పిల్లకాలవలో పడినట్లుగా… అల్లుడు చేతిలో అస్తమ దిశగా ప్రయాణం మొదలుపెట్టాల్సిన పరిస్థితిని పొందారు. ఆ సంగతులు అలా ఉంటే… నేడు ఆ వైభవం టీడీపీలో ఏది? ఆ పౌరుషం కనిపించదేమి? ఆ సింగగర్జన వినిపించదేమి? ప్రస్తుతం కక్కలేక మింగలేక తమ్ముళ్లు పడుతున్న ఆవేదన ఇది!
ఇప్పుడు టీడీపీని, చంద్రబాబుని ఎవరైనా విమర్శించొచ్చు.. ఎన్నైనా అనొచ్చు.. ఏవరు ఏమన్నా పట్టించుకునే పరిస్థితి లేదు.. ఎదురుతిరిగే దమ్మూ లేదు.. రాజినామాలు చేసి ఎన్నికలకు వెళ్లే సత్తా లేదు. ఎందుకు ఇలా టీడీపీ జంకుతోంది. దానికంతటికీ కారణం… అవిరామంగా చంద్రబాబు చేసిన తప్పులే! అమరావతి విషయంలో బాబు తాజాగా స్పందించారు.. బలంగా స్పందించానని అనుకుంటున్నారు.. సవాల్ చేసేశాం “మమ” అనుకున్నారు.. జనాలు చూస్తున్నారు అని మరిచారు.. చిత్తశుద్ధి లోపం పుష్కలంగా కనిపించేలా చేసుకున్నారు!
అసలు సవాల్ చేస్తే ఎలాగుండాలి…? సవాల్ చేస్తే అందులో సింహగర్జన వినిపించాలి.. పిల్లి కూతలు వినిపించకూడదు! దమ్మున్న ఛాలెంజ్ లు చేస్తూ ప్రభుత్వాన్ని కడిగిపారేయాలి. ఇపాటికే అమరావతిలో వాలిపోయి మొదలుపెట్టెయ్యాలి. ఉన్నఫలంగా తమ పార్టీనేతలందరితోనూ రాజినామాలూ చేయించాలి. అమరావతిపై నిజంగా బాబుకి మాటల్లో చెబుతున్నంత ప్రేమ ఉంటే బాబు ఇవన్నీ చేసేవారు. కానీ… ఆఖరికి అమరావతిపై కూడా బాబుది మాటల ప్రేమే అని నిరూపించుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాలేదు.. బాబు మాట విని ఆ పార్టీ నేతలు కూడా గడపదాటలేదు. బాబు జూం ని నమ్ముకుంటే.. టీడీపీ నేతలు ట్విట్టర్ ని నమ్ముకున్నారు.. కాలం వెళ్లదీస్తున్నారు!! ఇంకెంతకాలం సాగుతుందో ఈ ఆన్ లైన్ డ్రామాలు… అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!