యశోద ఆసుపత్రిలో ఏం జరుగుతోంది..? ఈరోజు మరో యువతి ఆత్మహత్య…!

-

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థిని సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి హాస్టల్​లోని తన గదిలో మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా మాల్. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ ఘటన ఈరోజు జరగబోయే హైదరాబాదులోని మరో యశోద ఆసుపత్రిలో నిన్న మరో ఘటన చోటు చేసుకుంది.

yashoda
yashoda

నిన్న హైదరాబాద్ మలక్​పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఈ నెల 6న యశోద ఆస్పత్రిలో చేరారు. సోమవారం రాత్రి చికిత్స పొందుతున్న నేపథ్యంలో గది లోపలి బాత్రూంలో ఉరి వేసుకున్నారు.కొద్దిసేపటికి గమనించిన ఆస్పత్రి సిబ్బంది చాదర్​ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news