భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో 63,489 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 944 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 25,89,682కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,980 కి పెరిగింది. ఇక 6,77,444 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే మొత్తంగా చూసుకుంటే దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,62,258 మంది కోలుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,16,00,359 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో మొత్తం 7,68,603 మంది కరోనాతో మృతి చెందగా.. కరోనా బారి నుండి 1,43,21,844 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65,09,912 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.