కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (22-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శ‌నివారం (22-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covdi 19 top 10 updates on 22nd august 2020

1. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 30 ల‌క్ష‌లు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 30,05,281కి చేరుకుంది. ఆగ‌స్టు 7న కరోనా కేసులు 20 ల‌క్ష‌లు దాట‌గా.. మ‌రో 10 ల‌క్ష‌ల కేసులు దాటేందుకు 15 రోజులు ప‌ట్టింది. 6,57,450 క‌రోనా కేసుల‌తో మ‌హారాష్ట్ర దేశంలోనే టాప్ ప్లేసులో ఉంది.

2. ఏపీలో కొత్త‌గా 10,276 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,45,216కు చేరుకుంది. 89,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,52,638 మంది కోలుకున్నారు. 3,189 మంది చ‌నిపోయారు.

3. సెప్టెంబ‌ర్ 19 నుంచి దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్‌లో మొద‌టి మ్యాచ్ నుంచే ఆడేందుకు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. యూఏఈకి వ‌స్తే వారు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన ప‌నిలేదు. బ‌యో సెక్యూర్ బ‌బుల్ నుంచే వ‌స్తారు క‌నుక‌.. క్వారంటైన్ పాటించాల్సిన అవ‌స‌రం లేదు.

4. తెలంగాణ‌లో కొత్త‌గా 2,474 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,01,865కు చేరుకుంది. మొత్తం 744 మంది చ‌నిపోయారు. 78,735 మంది కోలుకున్నారు. 22,386 మంది చికిత్స తీసుకుంటున్నారు.

5. అమెరికాలోని ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన టీ3ఎక్స్ అనే ఔష‌ధం ద్వారా కేవ‌లం 30 సెక‌న్ల‌లోనే క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని తేలింది. టీ3ఎక్స్ అనేది ఒక ఆయింట్‌మెంట్‌. ఇప్ప‌టికే అది అక్క‌డ అందుబాటులో ఉంది.

6. వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను ఎలుక‌ల‌పై ప్ర‌యోగించారు. వాటి ముక్కులో ఆ టీకాను ఇచ్చారు. దీంతో ఆ ఎలుక‌ల రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరిగింద‌ని గుర్తించారు.

7. లండ‌న్‌లోని బ్రిస్ట‌ల్ సౌత్ మీడ్ హాస్పిట‌ల్ వారు చేప‌ట్టిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా సుమారుగా 3 నెల‌ల వ‌ర‌కు 75 శాతం మందిలో ఆ వైర‌స్ తాలూకు ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని గుర్తించారు.

8. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 14,492 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,61,942కు చేరుకుంది. 21,995 మంది చ‌నిపోయారు. 4,80,114 మంది కోలుకున్నారు. 1,69,516 మంది చికిత్స పొందుతున్నారు.

9. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 7,330 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,71,876కు చేరుకుంది. 4,615 మంది చ‌నిపోయారు. 1,84,568 మంది కోలుకున్నారు.

10. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రో 2 సంవ‌త్స‌రాల్లోగా క‌రోనా అంత‌మ‌వుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అన్నారు. 1918లో వ‌చ్చిన ఫ్లూ 3 వేవ్‌లలో జ‌నాల‌ను క‌బ‌ళించింద‌ని, అప్పుడా వ్యాధి చాలా రోజులు ఉన్నా.. క‌రోనా ఇప్పుడు త్వ‌ర‌గానే అంత‌మ‌వుతుంద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news