టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనతని సాధించాడు. ఇండియాలోని టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో విజయ్ దేవరకొండ ఏకంగా మూడో స్థానం దక్కించుకున్నాడు. బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్ మొదటి స్థానంలో, రణవీర్ సింగ్ 2వ స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు. జాబితాలోని టాప్ 10లో టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మాత్రమే ఉండటం గమనార్హం.
కాగా, ఇప్పటికే హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా వరుసగా 2018,2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మన రౌడీ స్టార్ ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రం చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ మూవీ షూటింగ్ కరోనా విజృంభిస్తుండటంతో మధ్యలో ఆగిపోయింది. దీంతో నాలుగు నెలల నుంచి విజయ్ ఇంటి పట్టునే ఉంటున్నాడు.