కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (29-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శ‌నివారం (29-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 29th august 2020

1. సెప్టెంబ‌ర్ 1 నుంచి అన్‌లాక్ 4.0 అమ‌లు కానున్న నేప‌థ్యంలో కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 7 నుంచి మెట్రో స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయి. సెప్టెంబ‌ర్ 21 నుంచి క్రీడా, వినోద‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఉంటుంది. మిగిలిన‌వ‌న్నీ మూసి ఉంటాయి.

2. ఏపీలో కొత్త‌గా 10,548 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరుకుంది. 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,12,687 మంది కోలుకున్నారు. 3,796 మంది చ‌నిపోయారు.

3. ఐపీఎల్ చెన్నై టీంలో క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డంతో బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌డంపై నిర్ణ‌యం తీసుకోలేదు. ఇప్ప‌టికే టోర్నీ షెడ్యూల్‌ను విడుద‌ల చేయాల్సి ఉన్నా ఇంకా మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని తెలుస్తోంది.

4. దేశంలో కొత్త‌గా 76,472 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 34,63,973కు చేరుకుంది. 62,550 మంది చ‌నిపోయారు. 26 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకున్నారు. 7 ల‌క్ష‌ల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

5. తెలంగాణ‌లో కొత్త‌గా 2751 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,166కు చేరుకుంది. మొత్తం 808 మంది చ‌నిపోయారు. 89,350 మంది కోలుకున్నారు. 30,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

6. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 16,867 క‌రోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,64,281కి చేరుకుంది. 5,54,711 మంది కోలుకున్నారు. 24,103 మంది చ‌నిపోయారు. 1,85,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

7. త‌మిళ‌నాడులో కొత్త‌గా 6,352 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,15,590కి చేరుకుంది. 3,55,727 మంది కోలుకున్నారు. 52,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,137 మంది చ‌నిపోయారు.

8. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కోమాలోనే ఉన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శరీరంలో రక్త ప్రసరణ, పల్స్‌ రేటు స్థిరంగా ఉన్నాయ‌ని వైద్యులు తెలిపారు.

9. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనారోగ్యం నుంచి కోలుకున్నారు. క‌రోనా త‌గ్గాక ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో మ‌ళ్లీ హాస్పిట‌ల్‌లో చేరారు. అయితే ఆయ‌న ప్ర‌స్తుతం కోలుకున్నార‌ని, త్వ‌ర‌లో డిశ్చార్జి అవుతార‌ని వైద్యులు తెలిపారు.

10. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేయ‌నున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను త‌మ‌కు కూడా అందించాల‌ని కోరుతూ బంగ్లాదేశ్‌కు చెందిన బెక్సిమ్కో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ సీరం ఇనిస్టిట్యూట్‌ను కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news