సుశాంత్‌ సింగ్‌ కేసు.. సీబీఐ వేసిన ఆ 2 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పని రియా..

-

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ కేసును సీబీఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది. గత 2 రోజులుగా రియాతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ సీబీఐ విచారిస్తోంది. శుక్ర, శనివారాల్లో సీబీఐ రియాను చాలా సేపు ప్రశ్నించింది. అయితే ఆమెకు రెండు రోజుల్లో దాదాపుగా 50 ప్రశ్నలు సీబీఐ వేయగా.. వాటిలో రెండు ప్రశ్నలకు మాత్రం ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు.

rhea not given correct reply to these two cbi questions

జూన్‌ 8న సుశాంత్‌ లవ్‌కు బ్రేకప్‌ చెప్పిన రియా అతని నివాసం నుంచి వెళ్లిపోయింది. అయితే బ్రేకప్‌ అయ్యేందుకు కారణాలు ఏమిటి ? అలాగే జూన్‌ 8 నుంచి జూన్‌ 14 మధ్య సుశాంత్‌ ఆరోగ్యం ఎలా ఉందో రియా ఎందుకు చెక్‌ చేయలేదు ? అదే సమయంలో అతను ఆమె సోదరుడికి మెసేజ్‌లు పంపి ఆమె ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేశాడు, కానీ రియా సుశాంత్‌ ఆరోగ్యాన్ని ఎందుకు పట్టించుకోలేదు ? అనే ప్రశ్నలకు రియా సీబీఐకి సరైన సమాధానం చెప్పలేదు. ఆమె చెప్పిన సమాధానాలపై సీబీఐ అసంతృప్తిగా ఉంది.

అయితే శుక్రవారం రియాను 10 గంటలపాటు సీబీఐ ప్రశ్నించగా, శనివారం 7 గంటల పాటు విచారించింది. ఇక ఆదివారం కూడా సీబీఐ రియాను ప్రశ్నించనుంది. కాగా ఈమెతోపాటు సుశాంత్‌ ఫ్లాట్‌మేట్స్‌ సిద్ధార్థ్‌ పిఠాని, శామ్యూల్‌ మిరాండా, సుశాంత్‌ మాజీ కుక్‌ నీరజ్, వాచ్‌మన్‌, మేనేజర్‌, రియా తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తిలను కూడా సీబీఐ ఒకేసారి విచారిస్తోంది. ఆదివారం విచారణలో మరిన్ని విషయాలను సీబీఐ సేకరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news