పరిటాల రవి పై.. టిడిపి వారి తండ్రి, కొడుకులు ప్రేమ

-

తెలుగుదేశం నేతగా రాయలసీమ పునర్నిర్మాణంలో పరిటాల రవి కీలకపాత్ర పోషించారని టిడిపి అధినేత చంద్రబాబు కొనియాడారు. పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు ఆర్పించారు.ఫ్యాక్షనిజం పడగలో సామాన్యుల బతుకులు ఛిద్రమైపోతున్న వేళ…ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన వ్యక్తి పరిటాల రవీంద్ర. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రసాదించిన వ్యక్తి పరిటాల రవీంద్ర అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.దివంగత నేత పరిటాల రవి జయంతి సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయనకు నివాళులు అర్పించారు.

పరిటాల అనే ఇంటి పేరును పోరాటాలు’గా మార్చుకున్న కుటుంబంలో నుంచి వచ్చి పేదల పక్షాన నిలబడ్డారు. జీవితమంతా ఫ్యాక్షన్ శక్తులతో పోరాడి పేదల గుండె చప్పుడుగా నిలిచారు అని నారా లోకేష్ అన్నారు.కరోనా నుంచి కోలుకున్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు నారా లోకేష్​కు స్పష్టం చేశారు. బెయిల్ పై విడుదలైన అచ్చెన్నాయుడుకి నారా లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news