ఆర్గానిక్ ఫామింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తోన్న పవన్ కళ్యాణ్

-

యువతకు, రైతాంగానికి మేలు చేకూర్చేలా ప్రకృతి వ్యవసాయం అదేనండీ ఆర్గానిక్ ఫామింగ్ ని పరిచయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 250 గజాల్లో 81 మొక్కలతో ఫలసాయం పొందే విధానాన్ని ఆయన జనానికి పరిచయం చేయనున్నారు. చారెడు నేల – బతుకు బాట పేరుతో రాజకీయాలకు అతీతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం అంటే కనీసం అరెకరం ఉండాలి అనుకొంటూ ఉంటామని, అలా కాకుండా కొద్దిపాటి జాగాలో సాగు చేసి ఆదాయం పొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నామని పవన్ పేర్కొన్నారు.

pawan-kalyan
pawan-kalyan

కరోనా విపత్తు వల్ల నగరాల్లో ఉపాధి కోసం వచ్చిన కార్మికులు, చిరుద్యోగులు స్వస్థలాలకు వెళ్ళిపోయారని అలాంటివారు సొంత ఊళ్లోనే ఉపాధి పొందేందుకు అవకాశం ఉన్న సాగు విధానం నమూనాలు రూపొందిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. 50×50 విస్తీర్ణంలో అంటే సుమారుగా 250 గజాల భూమిలో ఆదాయం ఇచ్చే విధంగా చేయడం లక్ష్యంగా ఈ సాగు ప్రక్రియ ఉంటుందని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. ప్రముఖ ప్రకృతి రైతు విజయరామ్ గారి సలహాసహకారాలతో వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన అన్నారు. పరిమిత విస్తీర్ణంలో ఎలా సేద్యం చేయాలి అనేదానిపై ఒక ప్రణాళిక మేరకు నిర్దేశిత డైరీతో అవగాహన కల్పిస్తామని పవన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news