కరోనా పేషెంట్ ని రేప్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

-

కరోనా రోగిని కేరళలోని పతనమిట్ట జిల్లాలో శనివారం రాత్రి అంబులెన్స్ డ్రైవర్ లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన సంచలనంగా మారింది. నేరం జరిగిన గంటల్లోనే అంబులెన్స్ డ్రైవర్‌ ను అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. కేరళలోని కరోనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) ప్రకారం, రోగులను అంబులెన్స్ ద్వారా మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అనుమతిస్తారు.

rape attempt
rape attempt

అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్ వచ్చిందని, ఒక రోగిని స్థానిక కరోనా ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. హెల్త్‌ కేర్ ఫెసిలిటీ వద్ద ఉన్న అధికారులు మరో రోగిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ కు సూచించారు. డ్రైవర్ అంబులెన్స్‌ ను ఎవరూ లేని ప్రదేశంలో ఆపి, వాహనం లోపల ఉన్న 22 ఏళ్ళ రోగిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆమె ఎవరికి అయినా చెప్తే ప్రాణాలు తీస్తా అని బెదిరించగా ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఆమె వైద్యులకు చెప్పగా పరిక్షలు చేయగా రేప్ నిజంగానే జరిగిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news