ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. దళిత జాతి పై జగన్ రెడ్డి కక్ష కట్టారు. 15 నెలల పాలన లో 2 శిరోముండనాలు, 60 దాడులు అని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా దళితుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. పేదల భూములు లాక్కోవడానికి సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు.
అనంతపురం జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, తూముచెర్ల గ్రామంలో దళిత మహిళా రైతు లక్ష్మీదేవి గారికి చెందిన భూమిని స్థానిక వైకాపా నాయకుల ఒత్తిడితో స్వాధీనం చేసుకోవడనికి పోలీసులు,రెవిన్యూ సిబ్బంది ప్రయత్నించారు. దింతో మహిళా రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసారని ఆయన పేర్కొన్నారు. కోర్టులో కేసు ఉండగానే భూమిని చదును చేసే హక్కు ఎవరిచ్చారు. న్యాయస్థానాలు అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్న అధికారులు, దళితులను వెంటాడి వేధిస్తున్న వైకాపా నాయకులు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
దళిత జాతి పై @ysjagan కక్ష కట్టారు.15 నెలల పాలన లో 2 శిరోముండనాలు,60 దాడులు. ఇప్పుడు ఏకంగా దళితుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. పేదల భూములు లాక్కోవడానికి సిగ్గుగా లేదా?(1/3) pic.twitter.com/g0fnN6z2nB
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020
అనంతపురం జిల్లా,రాప్తాడు నియోజకవర్గం,తూముచెర్ల గ్రామంలో దళిత మహిళా రైతు లక్ష్మీదేవి గారికి చెందిన భూమిని స్థానిక వైకాపా నాయకుల ఒత్తిడితో స్వాధీనం చేసుకోవడనికి పోలీసులు,రెవిన్యూ సిబ్బంది ప్రయత్నించారు. దింతో మహిళా రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేసారు.(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020
కోర్టులో కేసు ఉండగానే భూమిని చదును చేసే హక్కు ఎవరిచ్చారు. న్యాయస్థానాలు అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్న అధికారులు, దళితులను వెంటాడి వేధిస్తున్న వైకాపా నాయకులు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు.(3/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020