రియ‌ల్‌మి 6, రియ‌ల్‌మి 6ఐ ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గాయ్‌.. ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి ఇటీవ‌లే రియ‌ల్‌మి 7, 7 ప్రొ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం విదితమే. కాగా ఈ ఫోన్ల విడుద‌ల నేప‌థ్యంలో రియ‌ల్‌మి 6, 6ఐ ఫోన్ల ధ‌ర‌ల‌ను ఆ కంపెనీ త‌గ్గించింది. ఈ క్ర‌మంలో త‌గ్గిన ధ‌ర‌ల‌కే ప్ర‌స్తుతం ఈ ఫోన్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ఈ ఫోన్ల‌కు చెందిన అన్ని వేరియెంట్ల‌పై రూ.1వేయి ధ‌ర‌ను త‌గ్గించారు.

realme 6 and realme 6i phones price cut

కాగా త‌గ్గింపు ధ‌ర‌ల‌తో రియ‌ల్‌మి 6 ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియెంట్ ధ‌ర రూ.13,999కు చేరుకుంది. అంత‌కు ముందు దీని ధ‌ర రూ.14,999 ఉండేది. అలాగే రియ‌ల్‌మి 6 ఫోన్ 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.15,999 ఉండ‌గా ఇదిప్పుడు రూ.1వేయి త‌గ్గి రూ.14,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. అలాగే రియ‌ల్‌మి 6కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,999 ఉండ‌గా, ఇదిప్పుడు రూ.1వేయి త‌గ్గి రూ.15,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

రియ‌ల్‌మి 6కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.17,999 ఉండ‌గా, రూ.1వేయి త‌గ్గి రూ.16,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. అలాగే రియ‌ల్‌మి 6ఐ 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.14,999 ఉండగా రూ.1వేయి త‌గ్గి ఇదిప్పుడు రూ.13,999 ధ‌ర‌కే ల‌భిస్తోంది. వీటిని రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news