డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజన అరెస్ట్…!

-

టాలీవుడ్ డ్రగ్స్ కేస్ ను తలపిస్తుంది కన్నడ డ్రగ్స్ కేస్. ఆగస్ట్ లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్ట్ చేశారు బెంగళూర్ పోలీసులు. ముగ్గురు నిందితుల్లో అనిఖా..అనే యువతి ఉంది. పోలీసుల సోదాల్లో యువతి డైరీ స్వాధీనం చేసుకున్నారు. కన్నడ ఇండస్ట్రీ లో డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది అనిక. డైరీ లో ఇండస్ట్రీ కి చెందిన పలువురు పేర్లువున్నాయి. హీరో కు, హీరోయిన్ లు, సింగర్లకు డ్రగ్స్ సరఫరా చేసిన లిస్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్ట్ అనుమతితో సెర్చ్ వారెంట్ జారీ చేశారు.

పలువురు సెలబ్రిటీలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీ కి చెందిన 6 గురుని అరెస్ట్ చేసిన బెంగుళూర్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు… తాజాగా నటి సంజన ను అరెస్ట్ చేశారు పోలీసులు. పలు తెలుగు , తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది సంజన. ఇటీవల రాగిణి ద్వివేది అనే ఒక హీరోయిన్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆమె నుంచి కూడా కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు త్వరలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news