ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు.
ఈ విషయన్ని స్వయంగా ఆయనే కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అలాగే గత కొన్ని రోజులుగా తనని కలిసిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన కోరారు. వైద్యుల సూచనలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇకపోతే ఈనెల 3న ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి ఆళ్ల దశరథరామిరెడ్డి కన్నుమూశారు.