వివేకా హత్య కేసు.. మరోసారి రంగంలోకి సీబీఐ..!

-

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా.. ఈ కేసు విషయంలోకి సీబీఐ మరోసారి ఎంట్రీ ఇచ్చింది. తన తండ్రి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని గతంలో వివేకానంద కూతురు సునీత హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కొందరిపై అనుమానాలున్నాయంటూ ఆమె ఈ పిటిషన్ వేశారు. ఇందులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్లు కూడా ఉండటం గమనార్హం. దీనిపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌‌లో కేసు విచారణను ప్రారంభించారు.

అయితే ఈ కేసును ఏపీ ప్రభుత్వం సిట్‌కు అప్పగించడంతో… సిట్ అప్పటివరకు జరిపిన విచారణ గురించి సీబీఐ అధికారులకు అడిగి తెలుసుకున్నారు.‌ అలాగే అనుమనితులను, కుటుంబసభ్యులను కూడా సీబీఐ గతంలో విచారించింది. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా.. 40 రోజుల తర్వాత సీబీఐ ఈ కేసు విషయంలో విచారణ ప్రారంభించింది. ఈ మేరకు సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది. ఇకపోతే మార్చి 14 2019 వ తేది అర్ధరాత్రి తర్వాత వైఎస్‌ వివేకానందారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news