బన్ని స్టైలిష్ లుక్.. నిరాశలో ఫ్యాన్స్

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి ఈమధ్య తరచు మీడియా ముందుకొస్తున్నాడు. ఇక తను చేసే ప్రతి సినిమా గెటప్ తన అప్పియరెన్స్ లో చూపించే బన్ని లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్త లుక్ తో కనిపించాడు. అయితే ఈ లుక్ బన్ని ఇదవరకు తను నటించిన వరుడు సినిమా లుక్ గా అనిపించడం ఫ్యాన్స్ ను నిరాశలో ముంచెత్తుతుంది.

స్టార్ హీరోల ఫ్యాన్స్ కు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. తమ హీరో ఫలానా సినిమాలో ఆ లుక్ తో కనిపించాడు కాబట్టి సినిమా హిట్ అయ్యింది. ఈ లుక్ తో కనిపిస్తే కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ క్రియేట్ చేసుకుంటారు. అఫ్కోర్స్ వారి వారి నమ్మకాలు అలాంటివి అనుకోండి. లేటెస్ట్ గా బన్ని లుక్ చూసి త్రివిక్రం తో చేయబోతున్న సినిమాలో బన్ని ఇదే లుక్ తో కనిపిస్తాడేమో అని భయపడుతున్నారు.

అలా అయితే సినిమా దొబ్బినట్టే అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. బన్ని కెరియర్ లో డిజాస్టర్ మూవీల్లో వరుడు, బద్రినాథ్ లు వస్తాయి. ప్రస్తుతం లుక్ ఈ రెండు సినిమాల్లో ఉన్న మాదిరిగా ఉండటం వల్ల ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ఫ్యాన్స్ ఏర్పరచుకున్న ఈ భయాలు బన్నిని ఎలా జాగ్రత్తపడేలా చేస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news