కేంద్రంపై విరుచుకుపడ్డ హరీష్ రావు

-

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వలేదని… ఖర్చుల కోసం రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని కేంద్రం చెప్పడంపై తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేసారు. 2018-19 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 1,435 కోట్ల రూపాయలు కేటాయించకుండా సమాన మొత్తానికి రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసిందని, జిఎస్‌డిపిలో ఐదు శాతం వరకు రుణాలు తీసుకోవటానికి కేంద్రం ఆంక్షలు విధించి ఎగతాళి చేసిందని ఆయన మండిపడ్డారు.

ద్రవ్య లోటును తగ్గించడానికి ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (FRBM) చట్టం క్రింద. ఇప్పటికే ఉన్న రుణాల పరిమితిని మూడు శాతానికి చేరుకున్నందున రెండు శాతం అదనపు రుణాలు పొందాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బిఎం సవరణ బిల్లు 2020 ను సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తించే అదనపు రెండు శాతం రుణాలు పొందటానికి కేంద్రం షరతులు విధించిందని ఆయన అన్నారు. వివిధ ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న రుణాల విషయంలో దేశంలోని 29 రాష్ట్రాలలో తెలంగాణ 28 వ స్థానంలో ఉందని హరీష్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news