తొడలు రాపిడికి గురై చికాకు పెడుతున్నాయా.. ఇది తెలుసుకోండి..

-

తొడల మధ్య రాపిడి చికాకు తెప్పిస్తుంది. నడుస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా అనిపించి నలుగురిలో కలిసి తిరగనీయకుండా చేస్తుంది. రెండు తొడలు ఒకాదానికొకటి తాకడం వల్ల రాపిడి జరిగి చర్మ సమస్యలకి దారితీస్తుంది. ఆ భాగమంతా ఎర్రగా మారి, దురద పెడుతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఐతే ముందుగా ఈ రాపిడికి గల కారణాలు తెలుసుకోవాలి. సాధారణంగా ఈ రాపిడి స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటుంది. ముందుగా కారణాలని చూస్తే,

చెమట, చర్మం పొడిబారడం, నడవడం, పరుగెత్తడం, వేడి, తేమ, కూర్చునే విధానం సరిగా లేనందున, తొడ కండరాలు పెద్దగా ఉండడం, బిగుతుగా ఉండే స్కర్ట్స్ ధరించడం..మొదలగు కారణాల వల్ల తొడల మద్య రాపిడి జరుగుతుంది.

దీని నుండి బయటపడటానికి మార్గాలు..

కలబంద.. కలబంద గుజ్జుని తీసుకుని టీ ట్రీ ఆయిల్ తో మిక్స్ చేసి రాపిడి జరుగుతున్న చోట లేపనం చేసుకుని 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తుడిచివేయాలి.

లిప్ బామ్.. లిప్ బామ్ లో ఉండే పెట్రోలియం జెల్లీ తొడల మధ్య రాపిడిని తగ్గిస్తుంది.

కొత్తిమీర..

కొత్తిమీర ఆకులని తీసుకుని వాటిని సరిగ్గా నలగగొట్టి దాన్లో రెండు చుక్కల నిమ్మరసాని కలుపుకుని ఆ ప్రాంతంలో అప్లై చేసుకుని 15నిమిషాల తర్వాత తుడిచేసుకోవాలి.

తేనే..

తగినంతగా తేనె తీసుకుని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తొడలకి అప్లై చేయాలి.

ఓట్స్ స్నానం..

ఓట్స్ ని పిండిగా చేసి నీటిలో కలుపుకుని ఆ నీటితో స్నానం చేయాలి. 15నిమిషాల తర్వాత పూర్తిగా తుడిచేసుకోవాలి.

ఇంకా కొబ్బరి నూనే, ఆలివ్ ఆయిల్ మొదలగునవి ఈ సమస్య నుండి బయటపడేయడానికి బాగా పనిచేస్తాయి.

ఈ విధమైన చిట్కాలు పాటిస్తె తొడల మధ్య రాపిడి క్రమంగా తగ్గి చికాకు నుండి బయటపడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news