ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల ఎటువంటి విద్యాసంస్థలు ఇప్పుడప్పుడే ప్రారంభించేలా లేరు కాబట్టి, విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెబుతున్నారు. ఆన్లైన్ క్లాసెస్ అంటే కచ్చితంగా ఫోన్ లేదా ట్యాబ్ వారికి ఉండాలి. ఇప్పటికే చాలా మంది పిల్లలు ఫోన్ లకే పరిమితం అవుతున్నారు. వారి వయసు పరిమితి లేకుండా సెల్ ఫోన్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. దీనికితోడు ఆన్లైన్ తరగతులు వల్ల వాళ్ల జీవితం పూర్తిగా సెల్ ఫోన్ తోనే అంకితమవుతుంది.
ఇలాంటి సమయంలోనే పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు చెబుతున్నారు. గమనించడం అంటే ఒక క్లాస్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు వారి దగ్గరికి వెళ్లి వారితో కొంత సమయం వెచ్చించడం. జరిగిన తరగతి గురించి చర్చించడం వంటి విషయాలు చేయాలి. వీలైతే తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి క్లాసెస్ జరుగుతున్న సమయంలో వారి పక్కన కూర్చొని గమనించాలి.
వీలు ఉన్నప్పుడు కొంత సమయం పిల్లలకు కేటాయించి వారితో సమయం గడపడం వల్ల తమ పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రులకు ఒక అవగాహన వస్తుంది. పిల్లలను పెంచడం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు కాబట్టి, వారిని ఇష్టంతో కాకుండా భయాందోళనలతో పెంచితే తల్లిదండ్రులు అధిక ఒత్తిడికిలోనవడం కాకుండా అనేక అనారోగ్య సమస్యలను కూడా తలెత్తుతాయి. వీలైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం.