నితిన్ సినిమాలో తమన్నా.. కీలక పాత్రలో మిల్కీ బ్యూటీ..!

ఇటీవలే ఓ ఇంటివాడు అయినా టాలీవుడ్ యువ హీరో నితిన్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతూ.. అభిమానులందరికీ ఎప్పటికప్పుడు అప్డేట్ లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నితిన్ హీరోగా రంగ్ దే సినిమా తెరకెక్కుతోంది. అంతేకాకుండా త్వరలో మరో సినిమాకి కూడా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటిస్తుందని పాక్ వినిపించండి.

తాజాగా దీనిపై చిత్రబృందం క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో నితిన్ సరసన బన్నీ హీరోయిన్ గా నటిస్తుందని అంతే కాకుండా మరో కీలకపాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తుంది అన్న విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. ఇక నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలిపింది . అయితే నితిన్ సినిమాలో తమన్నా నటించబోతుంది అనేసరికి తమన్నా పాత్ర ఎలా ఉండబోతుంది అభిమానులందరిలో సరికొత్త ఆసక్తి మొదలైంది.