పాపం ఆ రైతుకి ప్రభుత్వం అందించిన బీమా రూపాయి…! తిరిగి ఇచ్చేస్తా అంటున్న రైతు…!

-

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని గోంధన గ్రామానికి చెందిన పూరన్‌ లాల్ అనే రైతు 1050 రూపాయల ప్రీమియానికి గానూ కేవలం ఒక్క రూపాయి పంట భీమా పొందాడు. జిల్లాకు చెందిన వేలాది మంది రైతులు తమ ఖాతాల్లో 100 లేదా 50 రూపాయల కన్నా తక్కువ భీమా పొందారు. పూరన్ లాల్ ఇప్పుడు ఈ రూపాయి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని యోచిస్తున్నాడు.

బీమా కవరేజ్ పేరిట బేతుల్‌ లోని రైతులకు ఏమైనా జరిగినా సరే ప్రభుత్వం ఆదుకునే ప్రశ్నే లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇప్పుడు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 22 లక్షల మంది రైతులకు పంటల బీమా మొత్తాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చింది. రెండున్నర హెక్టార్ల విస్తీర్ణంలో లక్ష రూపాయల విలువైన పంట చెడిపోయిందని, అయితే పంట భీమా మొత్తంగా తనకు ఒక రూపాయి మాత్రమే లభించిందని పూరన్‌లాల్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news