హైకోర్టులో కరోనా కలకలం..!

-

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసందే. శర వేగంగా వ్యాప్తి చెందుతూ అందరిపై పంజాబీ విసురుతోంది ఈ మహమ్మారి వైరస్. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అయితే ప్రభుత్వ కార్యాలయాలలో కూడా తరచు కరోనా వైరస్ కేసుల సంఖ్య బయటపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ అధికారులు సైతం మనశ్శాంతిగా ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు.

ఇటీవలే ఒడిశా హైకోర్టులో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. హైకోర్టు లోని వివిధ విభాగాల్లో పని చేసే పలువురికి సిబ్బందికి కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జడ్జి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం కోర్టును మూసి వేయనున్నట్లు తెలిపారు. కోర్టు మొత్తం శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ పునః ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. కాగా హైకోర్టు లో కరోనా వైరస్ వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news