కంగనా రనౌత్ విజ్ఞప్తిపై బీఎమ్సీకి షాక్ ఇచ్చిన హై కోర్టు..

-

ముంబైలోని కంగనా ఆఫీసు అక్రమ నిర్మాణం అంటూ సెప్టెంబర్ 9వ తేదీన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో కోర్టు స్టే విధించింది. ఐతే తాజాగా ముంబై హై కోర్టు బీఎమ్సీకి షాక్ ఇచ్చింది. శుక్రవారం విచారణకి రావాల్సిందిగా బీఎమ్సీని కోరింది. సగం కూలిపోయిన భవనాన్ని అలాగే వదిలివేయలేమని, వర్షాకాలం కారణంగా మరింత ఇబ్బంది ఎదురవుతుందని, అందువల్ల విచారణ రేపు జరగనుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో శివసేన ముఖ్య ప్రతినిధి సంజయ్ రౌత్, బీఎమ్సీ అధికారి రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. ఐతే సంజయ్ రౌత్ పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉండడం వల్ల అతని తరపున మరొకరు రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా బీఎమ్సీ అధికారిగా భాగ్యవంత్ రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. వాదనలు వినే ముందు వీరందరూ తన స్పందనని తెలియజేయాల్సి ఉంటుందని, దానికోసం మరింత ఆలస్యం చేయవద్దని, కూలిన భవనాన్ని అలాగే ఉంచలేమని, వర్షాకాలం కారణంగా మరింత ఇబ్బంది అవుతుందని హైకోర్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news