ఈ “భాషా”వేత్తలకు తెలుగంటే ఎంత ఇష్టమో.. మరి మనిషంటే!!

-

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని.. పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని.. ఫలితంగా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని.. చదువుకు, ఉన్నత భవిష్యత్తుకు ఆర్థిక వారి కుటుంబ పరిస్థితి ఆటంకం కాకూడదని.. నిజమైన విజన్ ఉన్న నేతగా ఆలోచించిన జగన్ కు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు కొందరు సోకాల్డ్ మేధావులు.. తెలుగు భాష అంటే ప్రాణమిచ్చేసేటంత మహానుభావులు!!

అవును… రాష్ట్రం మొత్తం ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ వచ్చేసి, ఒక మాదిరి ఆర్థిక స్థోమత ఉన్న ప్రతీ పిల్లా, పిల్లాడు ఇంగ్లిష్ మీడియా పాఠశాలలకే వెళ్తున్న సంగతి కళ్లున్న అందరికీ తెలిసిందే! అంటే మెజారిటీ కుటుంబాల పిల్లలు ఆర్థికంగా బలమైన వారు సుమారు నూటికి నూరుశాతం ప్రైవేటు స్కూల్స్ లో ఇంగ్ల్సిహ్ మీడియంలో చదివిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నాడే తెలుగు బాష కనుమరుగైపోతున్న భయం చూపించాల్సిన భాషావేత్తలు అని చెప్పుకునేవారు, తెలుగు బాష అంటే ప్రాణమిచ్చేస్తాం అని మైకుల ముందు కబుర్లు చెప్పేవారంతా… రాష్ట్రం మొత్తం ఇంగ్లిష్ మీడియంలో ప్రైవేటు పాఠశాలలు పెరిగిపోయినప్పుడు ఏమైపోయారు. వారి పిల్లలు వారి పిల్లల పిల్లలు ఏ స్కూల్స్ లో చదువుతున్నారో… కాస్త ఇంగితంతో ఆలోచించుకోవాలి!

పేదవాడు మాత్రమే ఈ భాషావేత్తల టార్గెట్ అనుకోవాలా.. వెనుకబడిన స్థాయి అని ముద్రవేసిన కొన్ని వర్గాల పిల్లలు మాత్రమే తెలుగు భాష ను కాపాడాల్సిన భాధ్యతను భుజాన వేసుకుని పుట్టారని అనుకోవాలా.. భాషా పండితులే చెప్పాలి. అజ్ఞానానికి అర్థజ్ఞానానికి మధ్య కొట్టుమిట్టాడే ఆలోచనలు ఇలానే ఉంటాయేమో!!

కాగా… ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, కవి, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు, కవులు వద్దిపర్తి పద్మాకర్‌, డి.విజయభాస్కర్‌, తెలుగు పండితుడు పాలపర్తి శ్యామలానంద ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news