ఐపీఎల్: కోహ్లీ నిర్ణయాలని తప్పుబట్టిన అగార్కర్..

-

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. 97పరుగుల తేడాతో ఓడిపోవడంతో బెంగళూరు అభిమానులు కోపంగా ఉన్నారు. ఐతే ఈ విషయమై ఛాలెంజర్స్ కెప్టెన్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచులని జారవిడిచిన కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్, కోహ్లీ నిర్ణయాలని తప్పుబట్టాడు. కెప్టెన్ గా కోహ్లీ ఆ నిర్ణయాలని తీసుకోవాల్సింది కాదన్నాడు.

కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాప్పుడు అదీగాక అతని వ్యక్తిగత స్కోరు వంద దాటిపోయినపుడు శివమ్ దూబేకి బౌలింగ్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నాడు. అలాంటి టైమ్ లో ప్రధాన బౌలర్ కి బాల్ ఇవ్వాలని, ట్వంటీ ట్వంటీలో కొన్ని బంతులైనా మ్యాచ్ తలరాతని మార్చేస్తాయని, అందువల్ల అలా చేయకుండా ఉండాల్సిందని తెలిపాడు. ఇంకా కోహ్లీ, నాలుగవ స్థానంలో దిగడం సరైన పని కాదన్నాడు. 207పరుగుల లక్ష్యం కనిపిస్తున్నప్పుడు కోహ్లీ నాలుగవ స్థానంలో రావడం ఎందుకు.. అసలు మూడవ స్థానానికంటే కిందకు దిగవద్దని పేర్కొన్నాడు. ఈ రెండు నిర్ణయాలు సరైనవి కావని కామెంట్ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news