బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను శుక్రవారం ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. డ్రగ్స్ వాడకంపై రకుల్‌ను ఎన్‌సీబీ ప్రశ్నించింది. ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమలను డగ్స్ వ్యవహరం తీవ్ర కలకలం రేపుతొంది. అయితే తాను ఏనాడు డ్రగ్స్ తీసుకోలేదని ఎన్ సీబీకి రకుల్ స్పష్టం చేసింది. అయితే రియా చక్రవర్తితో చాటింగ్ పై ఆరా తీశారు. కోడ్ లతో చాటింగ్ పై ప్రశ్నించారు. దాంతో డ్రగ్స్ గురించి తాను చాట్ చేసింది వాస్తవమేనని అంగీకరించారు. అయితే తాను డ్రగ్స్ వినియోగించలేదని రకుల్ తెలిపినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించి నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టినట్లు టైమ్స్ నౌ లో కథనం ప్రచురితమైంది. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ అయిన ధర్మప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్ డ్రగ్స్ సేకరించి సెలబ్రిటీలకు సరఫరా చేసేవారని రకుల్ ప్రీత్ సింగ్ విచారణలో ఎన్సీబీ అధికారులకు తెలిపినట్లు ఆ కథనంలో వెల్లడైంది.