పట్టభద్రుల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి

-

పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఓటరు నమోదు ప్ర‌క్రియ‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 15 లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో కేటీఆర్‌ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులందరూ తొలి రోజే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. తానూ అదే రోజున ఓటరుగా నమోదు చేయించుకుంటానని వెల్లడించారు. కాగా, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమన్వయం కోసం నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఇన్‌చార్జిలను నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news