తెలంగాణాలో తగ్గిన కరోనా కేసుల నమోదు !

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు భారీ గానే నమోదవుతున్నాయి. ఏ ఒక్క రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. అయితే ఈరోజు కాస్త కేసుల నమోదు తగ్గాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,967 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,85,833 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు 1100 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,234గా ఉన్నాయి.

telangana records 1087 corona cases in asingle day
telangana records 1087 corona cases in asingle day

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,54,499 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,058 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 83.13% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 82.39% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.59 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 50,108 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 28,50,869 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 297 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news