కేసీఆర్ చేసేవి అన్నీ పనికిమాలిన సమీక్షలే: రేవంత్

-

ఎల్బి నగర్, సరూర్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు మానవ తప్పిదమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అతని అనుచరులు చెరువులను, శిఖం భూములను కబ్జా చేయడం వల్లే ఈ పరిస్థితని ఆయన ఆరోపించారు. వరదలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్క మంత్రి వచ్చి జలమయమైన కాలనీల్లో పర్యటించ లేదని ఆరోపించారు.

కేటీఆర్ ట్విట్టర్, వీడియో కాన్ఫరెన్స్ లో తప్ప ఎక్కడా కనిపించరని, సీఎం కేసీఆర్ పనికిమాలిన అంశాలపై సమీక్షలు చేస్తున్నారే తప్ప, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవాలకు హాజరవుతారు కానీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం కేటీఆర్ రారని, వరదలతో ఎల్బీనగర్ లోని పలు కాలనీల ప్రజలకు భారీ ఆస్తి నష్టం జరిగిందని మండిపడ్డారు. ఆస్తి నష్టం అంచనా వేసి తక్షణమే బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news