నమ్రత కోసం మహేష్.. అందుకు రెడీ అయ్యాడు

-

ఎంబి ప్రొడక్షన్స్ లో ఇన్నాళ్లు తన సినిమాలను మాత్రమే సమర్పించిన మహేష్ కొత్తగా ప్రయోగాలకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అప్కమింగ్ టాలెంటెడ్ పీపుల్స్ కు అవకాశం ఇచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఇప్పటికే ఎంబి ప్రొడక్షన్ లో ఓ టీం ఏర్పడిందని టాక్. ఈ ప్రొడక్షన్ లో మొదటి సినిమా త్వరలో మొదలవనుందట. నూతన దర్శకుడితో అంతా కొత్త వాళ్లతో నమ్రత నిర్మాతగా ఓ సినిమా మొదలవుతుందట.

ఈ సినిమాలో మరో స్పెషల్ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ ఓ గెస్ట్ రోల్ ప్లే చేస్తాడట. మహేష్ రోల్ కూడా దాదాపు 20 నిమిషాల దాకా ఉంటుందని తెలుస్తుంది. మహేష్ ఆ మాత్రం ఉన్నాడు అంటే ఇక సినిమా రేంజ్ వేరే ఉంటుంది. ఇక ఈ సినిమా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం మహేష్ కూడా మహర్షి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news