వదినకు పదవి: చంద్రబాబు ప్లస్సా.. మైనస్సా..?

-

తనకు రాజకీయంగా గత్యంతరం లేని ప్రతిసారీ.. కేంద్రంలో కాస్త బాంగా అనిపించిన ప్రతిసారీ.. బీజేపీని తెచ్చుకోవడం, కలిసి గెలవడం, అనంతరం బీజేపీని ఎడమ కాలితో తన్ని పంపించడం చంద్రబాబుకూ అలవాటే.. తన్నించుకోవడం బీజేపీకీ అలవాటే! ఆ అవసరం 2019 ఫలితాలు చూసిన బాబుకు మళ్లీ వచ్చింది. 2024లో ఒంటరిగా వెళ్తె ఇంక పార్టీ, తాను కూడా రాజకీయంగా కనుమరుగైపోతామనే భయం పట్టుకున్న బాబుకు మళ్ళీ బీజేపీ అవసరం వచ్చిపడింది. ఈ సారి అందుకు వదిన పురందేశ్వరి ఏమైనా సహాయపడగలుగుతారా అనేది ఇప్పుడు బాబు ముందున్న భారీ ఆప్షన్!

చంద్రబాబుకు తానకు తాను ఒంటరిగా గెలిచి అధికారం కైవసం చేసుకోవాలనే కోరిక ఈ జన్మకు తీరదు అని మునిశాపం ఏమైనా ఉందో ఏమో తెలియదు కానీ… బాబు పొలిటికల్ కెరీర్ లో ఆ అవకాశం లేకుండా పోయింది! ఇది దారుణమైన విషయమే అయినా కూడా… బాబు కాబట్టి నెట్టుకొచ్చేస్తున్నారు! బాబుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీకి మిస్డ్ కాల్ ఇస్తారు.. వారు బలైపోతుంటారు! ఏపీలో బీజేపీకి నోటాను దాటే పరిస్థితి వచ్చిన ప్రతిసారీ బాబు.. బీజేపీతో జతకట్టి తల్లివేరు కూడా స్థిరపడకుండా పీకేస్తుంటారు! వీర్రాజు ఫీలింగ్ కూడా ఇదే అని పదే పదే చెప్పారు కూడా! ఈ క్రమంలో చంద్రబాబు వదిన దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది.

అయితే.. చంద్రబాబుకు – పురందేశ్వరికీ మధ్య సంబంధాలు ఏమీ బాగుండవు! ఆమె దారి ఆమెది.. బాబు దారి బాబుది!! అయితే బాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే బ్యాచ్ అని చాలా మంది అంటుంటారు కాబట్టి… ఆ లెకన చూసుకుంటే పురందేశ్వరి వద్దకు తన భార్యను, తన కుమారుడిని పంపి రాజకీయాలు చేస్తారని అంటున్నారు విశ్లేషకులు! ఆమె ద్వారా అయినా బీజేపీతో జతకట్టి కాలం వెళ్లదీద్దామని ప్లాన్ చేస్తుండొచ్చు! అయితే… ఇంతకూ పురందేశ్వరి, బాబు కోసం అమిత్ షా, మోదీలతో మాట్లాడతారా.. మరోసారి టీడీపీ – బీజేపీలను కలుపుతారా అంటే… ఒకపట్టాన్న సమాధానం దొరికే ప్రశ్న కాదది!

ఏపీ తరుపున సోము వీర్రాజు ఎలాగూ ఈ ఆప్షన్ కి ససేమిరా ఒప్పుకోరు! కానీ… పవన్ కు మాత్రం ముగ్గురం కలిసి పోటీ చేద్దాం అనే ఆప్షన్ కచ్చితంగా ఇష్టమనే అంటుంటారు జనసైనికులు! మరి ఇంతకూ ఇప్పుడు తాళం పురందేశ్వరి చేతిలో కూడా ఉంది అనేది తమ్ముళ్ల ఆశ! తన తండ్రిగారు పెట్టిన పార్టీ కాలగర్భంలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని తెలిసి కూడా సాయం చెయ్యకపోతే ఎలా చిన్నమ్మా… అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేయగల సమర్ధులు టీడీపీ నేతలు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి!! మరి వదినమ్మ.. చంద్రబాబుకు ప్లస్సా మైనస్సా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news