కాపు ఉద్యమం మళ్లీ మొదలవుతుందా ? ముద్రగడ పరిస్థితి ఏంటి ?

-

గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎగిసిపడిన కాపు ఉద్యమం కారణంగా ఏపీలో అల్లకల్లోలం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం వంటి పరిణామాలతో కాపుల రోడ్డెక్కి మరి ఉద్యమించారు.ఈ కాపు ఉద్యమానికి ముద్రగడ పద్మనాభం నేతృత్వం వహించి, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. తునిలో రైలు దహనంతో ఉద్యమం మరింతగా హింసాత్మకంగా మారింది.ఇది ఇలా ఉంటే, ఈ అంశంపై ఎటూ తేల్చకుండా చంద్రబాబు వదిలివేయడం, ఉద్యమాన్ని అణచివేసేందుకు కు గట్టిగా ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో కాపు ఉద్యమం చల్లారిపోయింది.
ఎన్నికల ప్రచారంలో జగన్  తాను కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు మాదిరిగా హామీ ఇవ్వలేను అంటూ చెప్పడంతో జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అయినా, 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించడంతో, ఇక ఉద్యమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. కాపు ఉద్యమం ఉంచి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించడంతో, ఈ ఉద్యమానికి సారధ్యం వహించే వారు కరువయ్యరు. సొంత సామాజిక వర్గం నుంచి తనపై విమర్శలు పెరిగిపోతుండటం, కాపు ఉద్యమాన్ని తాను సమర్థవంతంగా నిర్వహించలేను అనే అభిప్రాయం ఏర్పడడంతో ముద్రగడ సైలెంట్ అయిపోయారు.
కానీ 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు మాత్రం ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి మళ్లీ ఉద్యమానికి సారథ్యం వహించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఆయన ఇంటికి వెళ్లి మరి ఆయన ను ఒప్పించేందుకు ప్రయత్నించినా, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమానికి సారధ్యం వహించ లేనని ఖరాఖండిగా చెప్పేస్తూ ఉండడం తో ఉద్యమాన్ని నడిపించే నాయకులు ఎవరు అనే వెతుకులాటలో 13 జిల్లాల జేఏసీ నేతలు ఉన్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి సారధ్యం వహిస్తారని, మాజీ కేంద్రమంత్రి, కాపు నాయకుడు చేగొండి హరిరామజోగయ్య ముందుకు వస్తున్నా, ఆయన వయసు రీత్యా యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేదనీ, ఆయన పార్టీ నడపలేరనే అభిప్రాయంతో జెఏసి నేతలు ముద్రగడ కోసం గట్టిగానే మళ్లీ పయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news