‘బిగ్‌బాస్’ కు తగ్గుతున్న క్రేజ్‌!

-

గత మూడు సీజన్స్‌ కంటే ఈ సీజన్ బిగ్ బాస్ ‌పై వీక్షకులు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. అందుకు కారణాలు బోలెడు. బలమైన, తెలిసిన కంటెస్టెంట్స్‌ లేకపోవడం, కంటెస్టెంట్స్‌ మధ్య గేమ్‌ ప్లానింగ్‌ సరిగా లేకపోవడం, తెలిసిన ఫార్ములాను రుద్ది రుద్ది చూపించడం. ప్రధానంగా ఈ మూడు కారణాలు బిగ్ బాస్ పై ఆసక్తి సన్నగిల్లడానికి కారణం అనుకుంటే ‌ఇప్పుడు మరో కారణంగానూ బిగ్‌బాస్‌ 4పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు.

అదేంటంటే బిగ్‌బాస్‌ షోలో సీక్రెసీ లేకపోవడమేనట. ఇంతకూ బిగ్‌బాస్ ఏ విషయంలో సీక్రెట్‌ మెయిన్‌టెయిన్‌ చేయలేకపోతున్నారంటే.. ఎలిమినేటర్స్‌ విషయంలోనని అంటున్నారు బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌. గత సీజన్స్‌లోనూ కొన్ని ఎలిమినేటర్స్‌ విషయం లీకులైయాయి. కానీ అవి కొన్ని గంటల ముందే తెలిసేవి. కానీ నాలుగో సీజన్‌లో ఎలిమినేటర్‌ ఎవరనే విషయం రెండు రోజుల ముందే తెలిసిపోతుంది. నిజమే కదా!

Read more RELATED
Recommended to you

Latest news