వాచ్‌లను తయారు చేసే టైమెక్స్ కంపెనీ కొత్తగా హీలిక్స్ గస్టో 2.0 పేరిట ఓ నూతన ఫిట్ నెస్ బ్యాండ్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.2,495 ధరకు ఈ బ్యాండ్ వినియోగదారులకు లభిస్తోంది. ఇందులో యాక్టివిటీ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్ ఫీచర్‌లను అందిస్తున్నారు. ఈ బ్యాండ్ బ్లూ, గ్రే, బ్లాక్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అమెజాన్ లేదా టైమెక్స్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ బ్యాండ్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఈ బ్యాండ్‌లో 2.4 సెంటీమీటర్ల కలర్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఈ బ్యాండ్ 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఇందులో ఎస్‌వోఎస్ అలర్ట్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. క్యాలరీ కన్జమ్షన్ ట్రాకర్‌ను ఇచ్చారు. డెయిలీ యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. హార్ట్ రేట్‌ను తెలుసుకోవచ్చు. దీనికి ఐపీ 54 స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఎమర్జెన్సీ సమయంలో ఈ బ్యాండ్ ద్వారా యూజర్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఎస్ఎంఎస్ పంపించవచ్చు. సోషల్ మీడియా నోటిఫికేషన్లను కూడా ఇందులో చూసుకోవచ్చు.