ఫోర్డ్ ఇండియా దేశంలోని తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. డోర్ స్టెప్ సర్వీస్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఫోర్డ్ వాహనాలు ఉన్నవారు ఈ సేవలను ప్రస్తుతం వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా కస్టమర్లు తమకు సమీపంలోని ఫోర్డ్ సర్వీస్ సెంటర్ లేదా ఫోర్డ్ కు చెందిన డయల్ ఎ ఫోర్డ్ ద్వారా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా డోర్ స్టెప్ సర్వీస్‌ను పొందవచ్చు. ఇల్లు లేదా ఆఫీస్ ఎక్కడ ఉన్నా సరే కస్టమర్లు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు.
కాగా ఫోర్డ్ కంపెనీ అందిస్తున్న ఈ సర్వీస్ దేశంలో పలు ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, జైపూర్, లక్నో, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, ట్రివేండ్రం, హైదరాబాద్, కోల్‌కతా, భువనేశ్వర్, ముంబై, థానె, పూణె, ఔరంగాబాద్, అహ్మదాబాద్‌లలో ఉన్న ఫోర్డ్ కస్టమర్లు ఆ కంపెనీ అందిస్తున్న డోర్ స్టెప్ సర్వీస్‌ను పొందవచ్చు. వారు తమకు సమీపంలోని ఫోర్డ్ డీలర్‌షిప్ లేదా డయల్ ఎ ఫోర్డ్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకుంటే చాలు.. ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ అందిస్తారు.
డోర్ స్టెప్ సర్వీస్‌లో భాగంగా వాహన చెకప్, పార్ట్ రీప్లేస్‌మెంట్, డ్రై వాషింగ్ తదితర సేవలను పొందవచ్చు. సర్వీస్ ముగియగానే కస్టమర్లు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపవచ్చు. డోర్ స్టెప్ సర్వీస్ ద్వారా పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉంటే అందు కోసం కార్‌ను సర్వీస్ సిబ్బంది సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తరలించి సమస్యను పరిష్కరిస్తారు.