మరో వంద మిలియన్ల డోసులని సిద్ధం చేస్తున్న సీరం.. వారికోసమే.

-

పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోవిడ్ వ్యాక్సిన్ ని తయారీ చేస్తుందన్న సంగతి తెలిసిందే. వంద మిలియన్ల డోసులని ఉత్పత్తి చేయడానికి రెడీ అవుతోంది. దీనికోసం ఇతర దేశాలతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. అమెరికాకి చెందిన బిల్ గేట్స్, తన మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ దశ విజయవంతంగా పూర్తైతే వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

అయితే సీరం ఇన్స్టిట్యూట్ మరో వంద మిలియన్ల డోసులని ఉత్పత్తి చేయాలని సిద్ధం అవుతోందట. ముందు అనుకున్నట్టుగా వంద మిలియన్లతో పాటు మరో వంద మిలియన్లు, అంటే మొత్తంగా రెండువందల మిలియన్ల డోసులు రెడీ చేయడానికి సిద్ధపడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు బీదరికంలో ఉండే దేశాల ప్రజలకి కూడా వ్యాక్సిన్ ని అందించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. అస్ట్రాజెంకా తో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news