డిసెంబర్ లో గ్రేటర్ పోలింగ్.. సన్నాహక సమావేశాల్లో ఈసీ !

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయనే దానిపై పరోక్ష సంకేతాలిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. నవంబర్‌ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌ రావొచ్చన్న ఆయన ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. యాప్ప్తికే కాంగ్రెస్‌, బీజేపీ కూడా గ్రేటర్‌ ఎన్నికల వ్యూహరచనలో మునిగిపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందు గానే జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం షెడ్యూల్ కంటే మూడు నెలల ముందు ఎన్నికలు జరుపుకునే వెసులుబాటు ఉంది.

దీనితో అధికార పార్టీ గ్రేటర్ ఎన్నికలకు ముందుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. రానున్న ఎన్నికల్లో అధునాత టెక్నాలజీ వినియోగిస్తామన్న ఆయన నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియ ఆన్ లైన్‌లోనే నిర్వహిస్తామన్నారు. 150 పోలింగ్ కేంద్రాల్లో వార్డుకు ఒక ఫేస్ రికగ్నేషన్ యాప్‌ ను వాడతామని అలానే దివ్యాంగులకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఓటింగ్‌ విధానం అమలు చేయబోతోందని చెప్పారు. ఈ ఓటింగ్ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news