దేశంలో ఎనిమిదిన్నరకోట్ల మందికి కరోనా…!

-

భారత్ లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రతిరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు రికార్డవుతున్నాయి. దేశంలో ఏకంగా 61 లక్షల వరకు వైరస్ బాధితుల సంఖ్య నమోదైంది. అయితే ఇది అధికారికంగా మాత్రమే అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం దృష్టికి రాని కేసులు లక్షల్లోకాదు ఏకంగా కోట్లలో ఉన్నాయని సర్వేల్లో వెల్లడైంది. దీంతో అందరూ ఆశ్చర్చానికి గురవుతున్నారు. కొంతమందిలో కరోనా వైరస్ రావడమే కాదు దానంతట అదే తగ్గిపోతుంది కూడా అని సర్వేలు చెబుతున్నాయి.

ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతొక్కరు టెస్టులు చేయించుకుని ఆతర్వాత… పాజిటివ్ వస్తే చికిత్స కోసం హాస్పిటళ్లలో చేరుతున్నారు. ఇలా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుని పాజిటివ్ అని తేలినవారు మాత్రమే దేశంలో 61 లక్షలు మంది ఉన్నారు. కానీ టెస్టులు చేయించుకోకుండా..బయటకు రాని లెక్కలు కోట్లలో ఉన్నాయని ఐసీఎంఆర్ సర్వేలో బయటపడింది. ఇప్పటి వరకు ఏకంగా 8.53 కోట్ల మంది వైరస్ బారిన పడినట్టు ఈ సర్వేలో వెల్లడైంది. దేశంలోని 70 జిల్లాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం పదేళ్ల వయసు పైడిన వారిని పరిశీలించగా…వీరిలో 6.6శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయని సర్వే తెలిపింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 22 మధ్య ఈ సర్వే నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news