బాబ్రీ బ్రేకింగ్ : నిందితులంతా నిర్దోషులే…!

-

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పునిచ్చింది లక్నో సీబీఐ స్పెషల్‌ కోర్టు. ఈ కేసులో నిర్దోషులేనని తీర్పు ఇచ్చింది స్పెషల్‌ కోర్టు. కుట్రపూరితంగా బాబ్రీ మసీదు కూల్చివేత జరగలేదని పేర్కొన్న కోర్టు అద్వానీ సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చింది. రామ జన్మ భూమిలో అక్రమంగా బాబ్రీ మసీదును నిర్మించారంటూ కర సేవకులు 1992లో పెద్ద ఎత్తున అయోధ్యకు తరలి వచ్చారు. డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదుని ధ్వంసం చేశారు.

అయితే ఆ తర్వాత దేశ వ్యాప్తంగా తలెత్తిన ఘర్షణల్లో 1800 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాక్షి మహరాజ్ సహా విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్‌ కు చెందిన మరో 32 మంది నిందితులుగా ఉన్నారు. దోపిడీ, గాయ పరచడం, ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలతో వారిపై అభియోగాలు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news