బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ సోషల్ మీడియా ఏవిధంగా దుర్వినియోగం అవుతోందో తన అనుభవాన్ని పంచుకుంది. సుహానే షేర్ చేసిన ఈ టాపిక్ ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. స్కిన్ టోన్ ఆధారంగా ఒక వ్యక్తిని జడ్జ్ చేయడం సరి కాదని, కలరిజమ్ నశించాలని సుహానా పిలుపునిచ్చింది.
`ప్రస్తుతం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది నా గురించి మాత్రమే కాదు. ఇది ఎటువంటి కారణం లేకుండా హీనంగా భావించిన ప్రతి యువతి, యువకుడి గురించి. నేను కనిపించే తీరు, నా మేని ఛాయ గురించి కొంత మంది విమర్శలు చేశారు. నా స్కిన్ టోన్ కారణంగా నేను 12 ఏళ్ల వయసులో వున్న సమయం నుంచి పరిణతి చెందిన యువతీ , యువకులు నేను అగ్లీగా, అసహ్యంగా వున్నానని విమర్శలు చేస్తున్నారు` అని ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలని షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుహాన.
`మనమంతా భారతీయులం. సహజంగా మనం గోధుమ రంగు ఛాయలో వుంటాం. అలా అని మరో ఛాయలోకి మారాలని ప్రయత్రించినా మారలేం. అలాగే కంత మంది మనసు మలినమైపోయి వుంటుంది. వారు ఆ మలినాన్ని ఎంతగా పోగొట్టుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేరు. ఎందు కంటే వారి మనసు మలనమై వుంటుంది కాబట్టి. అంతే కాకుండా సొంత వారినే ద్వేషిస్తున్నారంటే వారు అభద్రతా భావంలో వున్నారన్నమాట` అని తనని అవమానించిన వారిపై వ్యంగ్యంగా కౌంటర్లేసింది సుహాన.