తెలంగాణ చెత్త రికార్డు.. అలాంటివాళ్లు ఇక్కడే అధికం..?

-

చదువుకునే వయసులో పిల్లలతో పని చేయించడం దారుణం అన్న విషయం తెలిసిందే. ఇలా బాలలను పని నుంచి రక్షించడానికి బాల కార్మిక చట్టం ఉంది. బాల కార్మికుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఒక చెత్త రికార్డులు నమోదు చేసింది. ఇటీవలే నిర్వహించిన సర్వేలో ఈ రకంగా బాల కార్మికులు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నారు అన్న విషయం బయటపడింది.

ఇటీవల జాతీయ నేర గణాంకాల బ్యూరో నిర్వహించిన సర్వేలో ఈ సంచలన నిజాలు బయటపడ్డాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రాష్ట్రంలోని బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని ఈ సర్వే తేల్చింది. 2019 కేసులో తెలంగాణలు 319 చైల్డ్ లేబర్ యాక్ట్ కేసులు నమోదయ్యాయని… 459 మంది బాల కార్మికులు రక్షింపబడ్డారు అధికారులు తెలిపారు. అధికంగా బాల కార్మికులు కలిగి ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత కర్ణాటక, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. ఇక మహిళలపై దాడులు జరుగుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర 2161 కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. 1204 కేసులతో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది

Read more RELATED
Recommended to you

Latest news