గతనెల 22, 23 తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు! ముఖ్యంగా పోలవరం నిధులు, రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన వాటిగురించి చర్చించారు! ఆ భేటీ అలా ముగిసిందో లేదో.. వెంటనే ఒక రకమైన వ్యాదితో బాదపడుతుందనే కామెంట్ సొంతం చేసుకున్న ఒక వర్గం మీడియా… ఒక కథనం వండి వార్చింది!
“జగన్.. ఏమిటిది..?” దూకుడు తగ్గించండి..! న్యాయ వ్యవస్థపైనే దాడి చేస్తారా? ఇలా రచ్చకెక్కడం మంచిది కాదు!.. పిలిపించి మందలించిన అమిత్ షా.. వివరణ ఇచ్చేందుకు జగన్ ప్రయత్నం.. పట్టించుకోని కేంద్ర హోంమంత్రి! అంటూ రాసుకొచ్చింది ఒక వర్గం మీడియా!! (అసలు “మీడియా” అన్నతర్వాత మళ్లీ “వర్గం” అనాల్సి వస్తున్నందుకు ఒక “జర్నలిస్టు”గా బాద అనిపిస్తున్నా తప్పడం లేదు! వారి ఫెర్ఫార్మెన్స్ అలా ఉంది కాబట్టి!) వారికి ఎలా తెలుసు అని అడగకండి… విశ్వసనీయవర్గాల సమచారం అని ఒక ఆప్షన్ ఉంటుంది! రహస్య భేటీలకు కూడానా అని అడగొద్దు!!
అయితే మంగళవారం మరోసారి హస్తినకు వెళ్లనున్నారు జగన్! అవును… ప్రధాని మోడీతో ఆరో తేదీన జగన్ కలిసేందుకు అపాయింట్ మెంట్ ఖరారైంది. దీంతో బుధవారం పొద్దున్న రావాల్సిన పేపర్ కు సంబంధించి ఆర్టికల్స్ అప్పుడే రెడీ అయిపోతున్నాయనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా కనిపిస్తున్నాయి!! మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆ టీవీ ఛానెల్స్ డిబేట్లలో రాబోయే చర్చా కార్యక్రమాలకు స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని మరో కామెంట్!
నిజంగా నెటిజన్లు వెటకారం ఆడుతున్నట్లుగా.. బుధవారం సంచికలో కూడా మోడీ.. జగన్ ను కడిగేశారని, దులిపేశారని, జగన్ ముఖం కందిపోయిందని రాసుకొస్తారా? లేక వాస్తవాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారా అనంది వేచి చూడాలి!!
-CH Raja