విండో 10 ఫీచర్లు.. తెలుసుకోండి ఇలా…!

-

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ను ఐదేళ్ల క్రితం లాంచ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ విభాగంలో మైక్రోసాఫ్ట్ సంస్థకు దాదాపు 86.69 శాతం వాటా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డివైజ్లు ఈ OS ఆధారంగా నడుస్తున్నాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. మన పని భారాన్ని తగ్గించి ఏకాగ్రతను పెంచేలా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను డిజైన్ చేశారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్లో మీకు తెలియని కొన్ని ఫీచర్లును కూడా తీసుకొచ్చారు.

mswindow
mswindow

అయితే వర్చువల్ డెస్క్టాప్ ఫీచర్లో మీరు రెండవ మానిటర్ను వాడుకోవచ్చునని తెలిపారు. క్విక్ యాక్సెస్ కోసం సెకండ్ స్క్రీన్పై కొన్ని అత్యవసర యాప్ విండోలను ఓపెన్ చేసి పెట్టుకోవచ్చునన్నారు. విండోస్10 లో బిల్ట్-ఇన్ వర్చువల్ డెస్క్టాప్ ఫీచర్ ఉంటుందన్నారు. ఇక టాస్క్ బార్లో ని టాస్క్ వ్యూ బటన్ను ఎంచుకొని లేదా Ctrl + Windows key + right/left arrow బటన్ను నొక్కడం ద్వారా ఒక డెస్క్టాప్ నుంచి మరో డెస్క్టాప్కు మారవచ్చునన్నారు.

ఇక విండోస్10లోని ఈ ఫీచర్ గురించి చాలామందికి తెలియకపోవచ్చునన్నారు. పెద్ద టెక్స్ట్ ఉండే ఈ మెయిళ్లను మ్యాన్యువల్ గా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, వాయిస్ టు టైప్ ఆప్షన్ ద్వారా సులభంగా కంపోజ్ చేయవచ్చునన్నారు. మీ ఈ మెయిల్ కంపోజ్ విండో, మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా నోట్ ప్యాడ్ వంటి ఏదైనా టెక్స్ట్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత Windows key + H నొక్కితే డిక్టేషన్ విండో ఓపెన్ అవుతుందని తెలిపారు.

అంతేకాదు విండోస్10 ఆపరేటింగ్ సిస్టంను వాడేవారు కీబోర్డ్ లోని ‘prt scr’ బటన్ను నొక్కి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చునన్నారు. ఆ తరువాత ఇమేజ్ ఎడిటర్ ఓపెన్ చేసి, అక్కడ స్క్రీన్ షాట్ పేస్ట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చునన్నారు. ఇక Snip & Sketch టూల్ ద్వారా స్క్రీన్ షాట్ను సులభంగా, వేగంగా ఎడిట్ చేసుకోవచ్చునన్నారు. అంతేకాదు కీబోర్డుపై Windows key + Shift + S నొక్కితే స్క్రీన్ షాట్ టూల్ ఓపెన్ అవుతుందని తెలిపారు.

ఇక సిస్టమ్పై పని చేస్తున్నప్పుడు మెయిల్, మెసేజింగ్ యాప్ లు లేదా థర్డ్ పార్టీ యాప్ ల నుంచి వచ్చే నోటిఫికేషన్లు చిరాకు తెప్పిస్తుంటాయి. ఇక వీటితో కొన్నిసార్లు ఏకాగ్రత దెబ్బతింటుందమొ తెలిపారు. విండోస్10లో ఫోకస్ అసిస్ట్ అనే ఆప్షన్ ద్వారా ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చునని అన్నారు. ఇక అనవసర నోటిఫికేషన్లను ఒకే ఒక్క క్లిక్తో ఆఫ్ చేసుకోవచ్చునని నిపుణులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news