ఎస్‌బీఐ కస్టమర్లు వెంటనే రుణం పొందండిలా..!

-

ఎస్‌బీఐ తన వినిమోగదారులకు శుభవార్తను వినిపించింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉపయోగకరంగా ఓ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫెసిలిటీతో ఈజీ బ్యాంకులో రుణం పొందేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ కేవలం వీధి వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీధి వ్యాపారుల కోసం ఇటీవలనే కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకం పేరు పీఎం స్వనిధి పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ.10,000 రుణాన్ని అందజేస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ పథకం ద్వారా ఆదుకుంటోంది.

SBI
SBI

భారతదేశ ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లో కూడా పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాన్ని పొందేలా చర్యలు తీసుకుంది. ఎస్‌బీఐ ఈ-ముద్రా పోర్టల్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)ను విడుదల చేసింది. దాదాపు 50 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

రూ.10,000 రుణాన్ని తీసుకున్న వినియోగదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా ఈఎంఐ రూపంలో కట్టే విధంగా సేవలను తీసుకొచ్చింది. ఏడాదిలోగా తీసుకున్న రుణ మొత్తాన్ని చెల్లించాలి. ఈ తరహా రుణాలపై కేంద్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీ రాయితీని కల్పిస్తుంది. రుణాన్ని నెలవారీగా ఈఎంఐ చెల్లించే వారికి ఏడాదికి రూ.1,200 వరకు క్యాష్‌బ్యాక్ చెల్లించనుంది. ఇప్పటివరకు స్వనిధి పథకంలో 7.85 లక్షల రుణాలు మంజూరయ్యాయి. రుణం పొందాలని అనుకునే వారు https://emudra.sbi.co.in:8044/emudra అనే వెబ్ సైట్ లో లాగిన్ అని డాక్యూమెంట్లు పొందుపరిస్తే రుణం మంజురు అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news