సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ పిక్సల్ సిరీస్‌లో నూతన స్మార్ట్ ఫోన్ పిక్సల్ 4ఎ ను గత ఆగస్టు నెలలో విడుదల చేసిన విషయం విదితమే. కాగా అదే ఫోన్‌ను శుక్రవారం భారత్‌లో విడుదల చేసింది. దీంట్లో 5.81 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్ ఉంది. 6జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ప్రత్యేకంగా టైటాన్ ఎం సెక్యూరిటీ చిప్‌ను ఇందులో అమర్చారు. అందువల్ల ఈ ఫోన్‌లోని యూజర్ల డేటాకు రక్షణ ఉంటుంది.
పిక్సల్ 4ఎ ఫోన్‌లో వెనుక వైపు 12.2 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ లభిస్తోంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక వైపు ఉంది. 3140 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
గూగుల్ పిక్సల్ 4ఎ స్పెసిఫికేషన్లు…
* 5.81 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* 12.2, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
* డ్యుయల్ సిమ్ (నానో సిమ్ + ఇసిమ్), ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి
* ఎన్ఎఫ్‌సీ, 3140 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
గూగుల్ పిక్సల్ 4ఎ స్మార్ట్ ఫోన్ కేవలం బ్లాక్ కలర్‌లో మాత్రమే విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.31,999గా ఉంది. కానీ లాంచింగ్ సందర్భంగా దీన్ని రూ.29,999 ధరకే విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ను తగ్గింపు ధరకు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.