లక్ష్మీదేవిని పూజిస్తున్న హాలీవుడ్ హీరోయిన్… ఎందుకో తెలుసా..?

-

మామూలుగా భారతదేశంలోని సంప్రదాయాలను భారతదేశంలో సరిగ్గా పాటిస్తారో పాటించరో కానీ విదేశీయులు మాత్రం ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు విదేశీయులు భారతీయ సంస్కృతులకు బాగా ఆకర్షితులై ఏకంగా భారతీయ సంస్కృతిలో వివాహాలు చేసుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు భారతీయ దేవుళ్ళను కూడా పూజిస్తున్నారు విదేశీయులు.

హిందువులందరూ సిరి సంపదలు ఇచ్చే దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే తాను కూడా లక్ష్మీదేవిని పూజిస్తాను అంటూ చెబుతుంది హాలీవుడ్ హీరోయిన్ సల్మా హయేక్. తాను తన అంతః సౌందర్యంతో మమేకం కావాలి అనుకున్నప్పుడు లక్ష్మీ దేవత పై దృష్టి పెడుతూ ధ్యానం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది హాలీవుడ్ హీరోయిన్. హిందువులు సిరిసంపదలకు ప్రతీక గా లక్ష్మీదేవిని పూజిస్తారని … తనకు మాత్రం లక్ష్మీదేవి చిత్రం చూస్తే తనకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news