ఏపీ ఎంసెట్–2020 ఫలితాలు విడుదలయ్యాయి..రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. మంత్రి ఆదిమూలకపు సురేష్ విడుదల..ఆన్లైన్ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు.. ఇంజనీరింగ్ విభాగంలో లక్షా 33 వేల 66 మంది విద్యార్థులు అర్హత సాధించారు..మొత్తం ఇంజనీరింగ్ విభాగంలో 84.78 శాతం ఉత్తీర్ణత సాధించారు..అగ్రి, మెడికల్ విభాగంలో 69 వేల 616 మంది అభ్యర్థులు అర్హత సాధించి, 91.77 శాతం ఉత్తీరణ సాధించారు..గతంలో కంటె ఈసారి ఉత్తీరణ శాతం పెరిగినట్లు మంత్రి సురేష్ ప్రకటించారు..త్వరలోనే కౌన్సిలింగ్ డేట్స్ ప్రకటిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
ఏపీ ఎంసెట్–2020 ఫలితాలు విడుదల..పెరిగిన ఉత్తీర్ణత శాతం..!
-