చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 37పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బెంగళూరు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఐతే నిజానికి బెంగళూరు బ్యాటింగ్ కి దిగినపుడు స్కోరు అంతగా పరుగులు పెట్టలేదు. 15ఓవర్లో కూడా మెల్లగా ఆడుతూ వచ్చారు. అప్పటికి స్కోరు వంద మాత్రమే ఉంది. 20ఓవర్లు పూర్తయ్యే సరికి 150 అయినా చేరుకుంటుందా అని అనుమానపడ్డారు. కానీ నాలుగు ఓవర్లలో మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది.
దానికి కారణం కోహ్లీ. ఆ నాలుగు ఓవర్లలో చితకబాదాడాంటే అతిశయోక్తి కాదేమో. 90పరుగులతో చెన్నై పై ఏ జట్టు కెప్టెన్ కూడా చేయనన్ని పరుగులు చేసాడు. ఐతే ఈ విషయంలో కోహ్లీపై ఆ జట్టు ఆటగాడు క్రిస్ మోరిస్ ప్రశంసలు కురిపిస్తున్నాడు. కోహ్లీ చాలా మంచి ఆటగాడు. ఆటలో అతడి మేధావితనం అందరికీ నచ్చుతుంది. క్లిష్ట సమయంలో జట్టుని ముందుండి నడుపుతాడు. కష్టతరమైన బౌలింగ్ లైనప్ ని సైతం గట్టిగా ఎదుర్కొంటాడు. దీంతో మిగతా ఆటగాళ్ళలో నమ్మకం పెరుగుతుంది. జట్టు గెలవాలని అనుకుంటాడు. అందుకు అనుగుణంగా ఆడతాడు. చెన్నైతో జరిగిన మ్యాచులో 16వ ఓవర్ నుండి అతడు చూపిన ఆటే జట్టుని విజయ తీరాలకి చేర్చిందని తెలిపాడు.