విద్యార్థులకు మరో సువర్ణావకాశం..?

-

ఇటీవలే విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నీట్ ఎగ్జామ్స్ ని దేశవ్యాప్తంగా నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్య నీట్ ఎగ్జామ్స్ నిర్వహించింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాశారు. కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం నీట్ పరీక్షకు హాజరు కాలేక నిరాశ మునిగిపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారినపడి నీట్ పరీక్షకు హాజరుకాని విద్యార్థులు కొంత మంది అయితే.. అటు అధికారులు కూడా కంటోన్మెంట్ జోన్ లలో నీట్ పరీక్షలు నిర్వహించలేదు.

అయితే పరీక్షలు రాయని విద్యార్థులందరికీ మరో అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో అక్టోబర్ 14న నీట్ పరీక్షలు నిర్వహించి 16వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కాగా ప్రస్తుతం నీట్ పరీక్షలు రాయలేదని నిరాశలో ఉన్న విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సువర్ణావకాశం అని చెప్పాలి. పరీక్షలు రాయని విద్యార్థులు ప్రభుత్వం సూచించిన రోజున పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news